
Trinethram News : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ మంత్రి అంబటి రాంబాబుకు సొంత పార్టీ నేతలే పొగ పెడుతున్నారు. అంబటికి వ్యతిరేకంగా పార్టీలోని అసమ్మతి వర్గాలు సమావేశం నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో పార్టీలోని పలువురు నేతలు సమావేశమై సత్తెనపల్లి టిక్కెట్ ను అంబటికి ఇస్తే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
