Second danger alert issued at Dhavaleswaram
Trinethram News : రాజమహేంద్రవరం:
తూర్పుగోదావరి జిల్లా
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.దిగువకు 13 లక్షల క్యూసెక్కుల వరదనీరు విడుదల చేసినట్లు గోదావరి రివర్ కన్జర్వేటర్, గోదావరి హెడ్ వర్క్స్ డివిజన్ ధవళేశ్వరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాశీ విశ్వేశ్వరరావు బులెటిన్ విడుదల చేసారు. ఉదృతంగా గోదావరీ ప్రవహిస్తున్నందున నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు.
నదీ స్నానాలు ఆచరించేం దుకు వెళ్ళరాదని,మత్స్య కారులు చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు.గోదావరీ ప్రవాహ ఉదృతి దృష్ట్యా గణేష్ విగ్రహాల నిమజ్జనం రానున్న 48 గంటలు నిర్వహించారాదని,ప్రస్తుతానికి వాయిదా వేసుకో వాలని సూచించారు.
గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశామని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App