
Trinethram News : ఎన్నికల్లో అక్రమాలకు, నిబంధనలకు ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సీ-విజిల్’ యాప్ను ప్రవేశపెట్టింది.
ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చు.
ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి యాప్లో అప్లోడ్ చేయాలి.
ఫిర్యాదుచేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు.
దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదుపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు.
