TRINETHRAM NEWS

తిరుపతి :- 29 ఫిబ్రవరి 2024

  • మార్చి 1న ధ్వజారోహణం తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మార్చి 1 నుండి 10వ తేదీ వరకు ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. అంకురార్ప‌ణం సందర్భంగా సాయంత్రం మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ త‌రువాత శాస్త్రోక్తంగా అంకురార్పణం జ‌రిగింది.

మార్చి 1న ధ్వజారోహణం :

  మార్చి 1న ఉదయం 7.40 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. అనంతరం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు పల్లకీ ఉత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి.

   ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు,సూపరింటెండెంట్ శ్రీ భూపతి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

    ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు పురవీధుల్లో వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

01-03-2024

ఉద‌యం – ధ్వజారోహణం(మీనలగ్నం)

రాత్రి – హంస వాహనం

02-03-2024

ఉద‌యం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

03-03-2024

ఉద‌యం – భూత వాహనం

రాత్రి – సింహ వాహనం

04-03-2024 ఉద‌యం – మకర వాహనం

రాత్రి – శేష వాహనం

05-03-2024

ఉద‌యం – తిరుచ్చి ఉత్సవం

రాత్రి – అధికారనంది వాహనం

06-03-2024

ఉద‌యం – వ్యాఘ్ర వాహనం

రాత్రి – గజ వాహనం

07-03-2024

ఉద‌యం – కల్పవృక్ష వాహనం

రాత్రి – అశ్వ వాహనం

08-03-2024

ఉద‌యం – రథోత్సవం (భోగితేరు)

రాత్రి – నందివాహనం

09-03-2024

ఉద‌యం – పురుషామృగవాహనం కల్యాణోత్సవం,

రాత్రి – తిరుచ్చి ఉత్సవం

10-03-2024

ఉద‌యం – త్రిశూలస్నానం ధ్వజావరోహణం,

రాత్రి – రావణాసుర వాహనం

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.