SBI Massive Notification – 1040 SCO Posts – Apply!
Trinethram News : బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్హతలు, వయోపరిమతి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.
ఉద్యోగాల వివరాలు
రిలేషన్షిప్ మేనేజర్ – 273 పోస్టులు
వీపీ వెల్త్ – 643 పోస్టులు
రిలేషన్షిప్ మేనేజర్ (టీమ్ లీడ్) – 32 పోస్టులు
రీజినల్ హెడ్ – 6 పోస్టులు
ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ – 30 పోస్టులు
ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ – 49 పోస్టులు
సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రోడక్ట్ లీడ్) – 2 పోస్టులు
సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్) – 2 పోస్టులు
ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (టెక్నాలజీ) – 1 పోస్టు
ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (బిజినెస్) – 2 పోస్టులు
మొత్తం పోస్టులు – 1,040
విద్యార్హతలు
SBI SCO Eligibility :
సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్) : ఎంబీఏ/ పీజీడీఎం/ పీజీడీబీఎం లేదా సీఏ/ సీఎఫ్ఏ చదివి ఉండాలి. NISM ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్/ రీసెర్చ్ అనలిస్ట్ సర్టిఫికెట్/ సీఎఫ్‌పీ/ ఎన్ఐఎస్ఎం 21A లేదా 21B ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
రిలేషన్షిప్ మేనేజర్ : ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. వెల్త్ మేనేజ్మెంట్లో కనీసం 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ : ఎంబీఏ/ పీజీడీఎం/ పీజీడీబీఎంలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సీఏ/ సీఎఫ్ఏ చదివి ఉండాలి. కనీసం 6 ఏళ్ల పని అనుభవం కూడా ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
వయోపరిమితి
SBI SCO Age Limit :
సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్) : అభ్యర్థుల వయస్సు 30 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి.
రిలేషన్షిప్ మేనేజర్ : అభ్యర్థుల వయస్సు 23 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి.
రీజినల్ హెడ్ : అభ్యర్థుల వయస్సు 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజిస్ట్రేషన్ ఫీజు
SBI SCO Application Fee :
జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.750 చెల్లించాలి.
ఓబీసీ, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.
ఎంపిక ప్రక్రియ SBI SCO Selection Process : అభ్యర్థుల క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఆధారంగా వారిని షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత వారికి ఇంటర్వ్యూ, బృంద చర్చలు నిర్వహిస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
SBI SCO Online Apply Process :
అభ్యర్థులు ముందుగా https://sbi.co.in/web/careers వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఎస్బీఐ SCO Apply Online లింక్‌పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
మీ ఫొటో, సిగ్నేచర్ సహా అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి. భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి. ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 జులై 19
దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఆగస్టు 8
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App