పీవీటీజీ లకు పిఎం జన్ మాన్ ఇల్లు 5 లక్షలు పెంచాలి.
ఇసుక ఉచితంగా ఇవ్వాలి – ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్
Trinethram News : అల్లూరి జిల్లా అరకులోయ పట్టణం త్రినేత్రం న్యూస్
కేంద్ర ప్రభుత్వం పీవీటీజీ లకు మంజూరు చేసిన పీఎం జన్ మాన్ ఇల్లులకు 5 లక్షలు అంచనా విలువ పెంచాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు.
ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీఎం జన్ మాన్ ఇల్లులు పథకం పీవీటీజీ లకు ఒక్కొక్క లబ్ధిదారుడికి 2 లక్షల 39 వేలు అంచన విలువతో మంజూరు చేశారని ఇందులో గ్రామీణా ఉపాధి హామీ క్రింద 39 వేల రూపాయాలు నిధులతో ఇల్లు పునాది త్రవ్వుకునుటకు 50 రోజులు ఇతర పనులకు 40 రోజులు మొత్తం 90 రోజుల పనిదినాలకు 39 వేల రూపాయలు మంజూరు చేశారని కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు కలిపి 2 లక్షల 39 వేలు పీఎం జన్ మాన్ ఇల్లులు పథకం ద్వారా పీవీటీజీ లకు ఇల్లులు మంజూరు చేశారని భవన నిర్మాణా పరికరాలు సిమ్మెంటు ,రాడ్లు, ఇటుకల ధరలు విపరీతంగా పెరిగిందని ఉచిత ఇసుక పథకం అమలు కావడం లేదని మండల కేంద్రాల నుండి గ్రామాలకు ఇసుక రవాణా చార్జి 10 వేలనుండి 15 వేలు వరకు పెంచారని దీంతో జన్ మాన్ ఇల్లులు నిర్మాణం పూర్తి చేయలేని పరిస్థితి నెలకొందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం జన్ మాన్ ఇల్లులకు 5 లక్షలు అంచన విలువ పెంచాలని పిఎం జన్ మాన్ ఇల్లు మంజూరైన ప్రతి పీవీటీజీ లాభ్దిదారులకు సకాలంలో బిల్లు చెల్లించాలని డిమాండ్ చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App