RVR OB company workers should be employed immediately and given employment
RVR ఓబీ కంపెనీ కార్మికులను వెంటనే పనిలోకి తీసుకొని ఉపాది కల్పించాలి.
లేబర్ ఆఫీసర్ తక్షణమే జోక్యం చేసుకొని ఓబిని నడిపే విధంగా చర్యలు తీసుకోవాలి.
PSCWU IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ డిమాండ్.
తేది 13:07:2024 నాడు RVR ఓబి కంపెనీ కార్మికులతో సమావేశం జరిగింది.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈ సమావేశంలో PSCWU IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ మాట్లాడుతూ గత ఐదు రోజులుగా కంపెనీని అకారణంగా మూసివేసి కార్మికులను అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే చట్టబద్ధ చర్యలు ఎలాంటివి తీసుకోకుండానే ఆర్ వి ఆర్ యాజమాన్యం కంపెనీని మూసివేస్తున్నట్టు ప్రకటించి కార్మికులను గంధరగోల పరిస్థితికి నెట్టింది.
గత ఐదు రోజుల క్రితం చుట్టుపక్కల నివాసముండే డివిజన్లలో నిరుద్యోగులంతా స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆర్ వి ఆర్ కంపెనీ ముందు ధర్నా నిర్వహించి తమ డిమాండ్లను తెలుపడం జరిగింది. దీనికి ప్రతీకారంగా ఆర్ వి ఆర్ యాజమాన్యం స్థానికంగా ఉన్న 450 మంది కార్మికులను తొలగించి కంపెనీని నడపలేమంటూ చేతులెత్తేయడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది.
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు ఆర్ వి ఆర్ యాజమాన్యం ఇట్లాంటి చర్యలకు పాల్పడడం సరికాదు. వెంటనే కంపెనీ ప్రారంభించి అందులో పని చేస్తున్న కార్మికులకు యధావిధిగా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే లేబర్ అధికారులు జోక్యం చేసుకొని ఎలాంటి అనుమతులు లేకుండా మూసివేస్తున్నట్టుగా ప్రకటించిన ఆర్ వి ఆర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App