TRINETHRAM NEWS

అభివృద్ధికి ‘రుడా’ దోహదపడుతుంది కాంగ్రెస్ నాయకుడు పీక అరుణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఐటి మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ధన్యవాదములు తెలిపారు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం నగరపాలక సంస్థతో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు 198 గ్రామాలు విలీనం చేస్తూ రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో నెంబర్ 165 జారీ అయ్యింది. ‘రుడా’ ఏర్పాటుతో సమగ్రంగా అభివృద్ధి సాధిస్తాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీక అరుణ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు..

ఈ మేరకు పీక అరుణ్ మాట్లాడుతూ రుడా ఏర్పాటు వలన ఈ ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి సాదించేందుకు దోహదపడుతుందన్నారు. పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. పట్టు వదలని విక్రమార్కుడిలా రామగుండం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పని చేస్తున్నరాని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విజ్ఞప్తిపై స్పందించి ‘రుడా’ ఏర్పాటుకు జీవో జారీచేసిన ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర ఐటి మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అరుణ్ అభినందనలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App