TTDకి ఒక్క రోజే రూ.5.05 కోట్ల ఆదాయం..
తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఆదివారం ఒక్కరోజే రూ.5.05 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఆ రోజు 63,519 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ నెల 23 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాగా, జనవరి 1 వరకు కొనసాగనున్నాయి.
దీంతో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు.
నేటి శ్రీవారి పౌర్ణమి గరుడసేవ రద్దు
AP: ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడసేవను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడసేవ నిర్వహిస్తారు.
ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ ఉండదని టీటీడీ తెలిపింది.
భక్తులు గమనించాలని కోరింది.
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
AP: నేడు తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది.
ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 10గంటలకు జరగనున్న మీటింగ్లో అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు.
ఈ సమావేశానికి బోర్డు సభ్యులు హాజరుకానున్నారు.
కాగా ఈ నెల 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వ దర్శనం టోకెన్ల జారీని టీటీడీ పూర్తి చేసింది.
తదుపరి సర్వదర్శనం టోకెన్లు జనవరి 2 నుంచి ఇవ్వనున్నారు.