ప్రభుత్వ స్వాధీనంలోకి బాలీవుడ్ స్టార్ …సైఫ్ కుటుంబానికి చెందిన రూ.15 వేల కోట్లు ఆస్తులు!
సైఫ్ అలీఖాన్ కుటుంబ ఆస్తులపై వివాదం
భోపాల్‌లో వేల కోట్ల రూపాయల వారసత్వ ఆస్తులు
ఎనిమీ యాక్ట్ కింద స్వాధీనం చేసుకునే ఛాన్స్
Trinethram News : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుటుంబానికి చెందిన రూ.15 వేల కోట్ల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఉన్న పటౌడీ కుటుంబానికి చెందిన ‘ఫ్లాగ్ హౌస్’ను ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. భోపాల్‌లో సైఫ్ కుటుంబానికి రూ.1000 కోట్లకు పైగా ఆస్తి ఉంది. దీనికి సంబంధించిన పలు వివాదాలు న్యాయస్థానాల్లో నడుస్తున్నాయి. అయితే, 2015లో వీటిపై విధించిన స్టేను ఇటీవలే కోర్టు ఎత్తివేసింది. దీంతో సైఫ్ అలీఖాన్ బాల్యంలో గడిపిన ఫ్లాగ్ స్టాఫ్ హౌస్, నూర్ ఉస్ సాభా ప్యాలెస్, దార్ ఉస్ సలాం, హబిబి బంగ్లా, అహ్మదాబాద్ ప్యాలెస్, కొఫేజా ప్రాపర్టీ సహా భోపాల్‌లోని పటౌడీ కుటుంబానికి చెందిన రూ. 15 వేల కోట్ల విలువైన ఆస్తి ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 ప్రకారం ప్రభుత్వానికి అధీనంలోకి వెళ్లే అవకాశం ఉంది.
ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్ని 1968లో రూపొందించారు. ఈ చట్టం ప్రకారం దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లిపోయిన వ్యక్తులు.. భారత్‌లో వదిలిపెట్టిన ఆస్తులపై అధికారం కేంద్ర ప్రభుత్వానికి దఖలుపడుతుంది. భోపాల్ చిట్టచివరి నవాబ్ హమీదుల్లా ఖాన్‌కు ముగ్గురు కుమార్తెలు.. ఖాన్ ఆస్తికి చట్టబద్ధ వారసురాలు ఆయన పెద్ద కూతురు అబిదా కాగా.. ఆమె 1950లో పాక్‌కు వలస వెళ్లిపోయారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఈ ఆస్తి ఎనిమీ ప్రాపర్టీ చట్టం కింద ప్రభుత్వానికి చెందుతుందని తెలిపింది. కానీ, నవాబ్ రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ వారసులు (సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాగూర్ వంటివారు) ఈ ఆస్తిపై తమకు హక్కు ఉందని కోర్టును ఆశ్రయించారు
భోపాల్ అహ్మదాబాద్ ప్యాలెస్ సమీపంలోని ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ సైఫ్ అలీఖాన్ కుటుంబానికి చెందింది. 2011లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరణం తర్వాత సైఫ్‌కి భోపాల్ నవాబ్ బిరుదుతో తలపాగా ఉత్సవం కూడా ఘనంగా జరిపించారు. ఇప్పుడు పటౌడీ వంశానికి సైఫ్ అలీ ఖాన్ ప్రధాన వారసుడు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App