TRINETHRAM NEWS

తేదీ: 07/01/2025.
పోలవరం ముంపు ప్రాంత ప్రజలకు అందిన ఆర్ మరియు ఆర్ ప్యాకేజీ.

ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, వె లేరుపాడు మండల ముంపు ప్రాంత ప్రజలకు ఉమ్మడి కూటమి ప్రభుత్వం వారి బాధలను అర్థం చేసుకొని ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఆర్ మరియు ఆర్ మరియు
ఇతరత్రా ప్యాకేజీలు ఒకేసారి వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. పది రోజుల ముందే భోగి ,సంక్రాంతి కనుమ పండుగ వచ్చిందని , అదేవిధంగా మన రాష్ట్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి, మరోవైపు సూపర్ సిక్స్ పథకాల అమలు చేయడం గొప్ప విశేషమని ప్రజలంటున్నారు. అంబేద్కర్ కూడలి వద్ద నిర్వాసితులు తేదీ: 06/01/2025 న అనగా సోమవారం నాడు చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు ఓలేటి. నాగ, దుర్గ అనిల్, శాఖమూరి, సంజీవులు, ఎం.డి . నకిమ్,నూప. శ్రీరాములు , కట్టం. రాంబాబు, గొంది. నాగేశ్వరరావు, వి. మాధవరెడ్డి, నరసయ్య, కుంజా. బాబు , రామారావు, సరియం. రాజులు, చాపర్ల. శ్రీను, అమరవరపు. వెంకన్న, వీర్రాజు, చందా.కనకారావు, వెంకటేశ్వర్లు, పి. సీతారాములు , కె. కృష్ణ, జె. శ్రీకాంత్, యం. సుబ్బారావు . మహిళా కార్యకర్తలు మరియుతదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App