RFCL workers who are being exploited
చిలుక శంకర్ ప్రధాన కార్యదర్శి పెద్దపెల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం (IFTU)
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై పెద్దపెల్లి జిల్లా కాంటాక్ట్ కార్మికుల సంఘం(IFTU ) ఆధ్వర్యంలో LEO సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా పెద్దపెల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి సిలక శంకర్ మాట్లాడుతూ రామగుండం ఎరువుల కర్మాగారంలో గత నాలుగు సంవత్సరాలుగా వివిధ కేటగిరీలలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు.
ఈ కార్మికులకు ఎలాంటి చట్టబద్ధ హక్కులు సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆర్.ఎస్.సి.ఎల్ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది.
ప్రధానంగా లోడింగ్ అన్లోడింగ్ లో బ్యాగర్స్ అండ్ స్టీచర్స్ కార్మికులకు సమయపాలన లేకుండా ఏ సమయానికి రేకు వస్తుందో తెలియని పరిస్థితి అర్థరాత్రి వెళ్లాల్సిన పరిస్థితి నడుస్తోంది.
ఎలాంటి సేఫ్టీ సౌకర్యాలు లేకుండా కాంట్రాక్టు కార్మికులతో పనులు చేపిస్తున్నారు.
ఆర్ ఎఫ్ సి ఎల్ యాజమాన్యం కార్మికుల శ్రమతో అధిక లాభాలు వస్తున్న కూడా కార్మికులను శ్రమ దోపిడికి గురి చేస్తున్నారు.
కార్మికుల కు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఎట్టి చాకిరి చేపిస్తున్నారు.
ఈ కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని సంబంధిత ఆర్ ఎఫ్ సి ఎల్ యాజమాన్యం మరియు కాంట్రాక్టర్ తో మాట్లాడి కార్మికులకు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ఆర్ ఎఫ్ సి ఎల్ బ్రాంచ్ నాయకులు తిప్పని రాంకీ , కే రూపేష్, పయ్యావుల శ్రీకాంత్, బైరీ రాకేష్, చింతల ప్రవీణ్, ఆవుల రాకేష్, మిట్ట వేణు, ఆకుల అనిల్. తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App