TRINETHRAM NEWS

రూ.350 కోట్లతో విద్యార్దినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న రేవంత్ సర్కార్!

ఎన్నికల హామీల్లో భాగంగా 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు 1,784 కాలేజీలు ఉండగా.. పేద విద్యార్థినులు సుమారు 5 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో 2 లక్షల మంది మహానగర పరిధిలో ఉండగా ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వారు 70 వేల మంది వరకు ఉన్నారు.

కేంద్ర సబ్సిడీ పోను ఒక్కో స్కూటీకి 50 వేల రూపాయల చొప్పున 70 వేల స్కూటీలకు రూ.350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. విధివిధానాలు, దరఖాస్తు చేసుకునే వివరాలు త్వరలో విడుదల.