సంపూర్ణ స్వాతంత్ర స్ఫూర్తిగా గణతంత్ర సంబరాలు
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా కంభం.
కంభం:సామాజిక, ఆర్థిక అసమానతలు నేడు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటని,దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని, పేదరికం, ఆరోగ్య సంరక్షణలో అసమానతలు ఇప్పటికీ ఉన్నాయని, ఈ అంతరాలను తగ్గించడం, అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి పౌరునికి చేరేలా చేయడం మన సమిష్టి బాధ్యతని, భారతదేశాన్ని అత్యుత్తమ దేశంగా నిర్మించేందుకు మన వంతు కృషి చేయాలని ఎమ్మార్వో కిరణ్, ఎంఈఓ లు మాల్యాద్రి శ్రీనివాసులు అన్నారు.
స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎంఈఓ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…మనం స్వేచ్ఛతో పాటుగా భవిష్యత్ తరాలకు సహజ వనరులను అందించేందుకు కృషి చేయాలన్నారు.ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. మన సరిహద్దులను కాపాడే సైనికులకు.. అన్నం పెట్టే రైతన్నలకు.. సాంకేతికంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న శాస్త్రవేత్తలకు కృతజ్ఙతలు తెలియజేద్దామని సమాజ నిర్మాణానికి మనవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవ విశేషాలను విద్యార్థులకు వివరించి మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App