TRINETHRAM NEWS

నిర్బంధం నీడలో ప్రజాభిప్రాయ సేకరణ సరికాదు.

ప్రభావిత ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి.

సిపిఐ మాల్ మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఎన్టిపిసి లోని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో సిపిఐ మాల్ మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సిపిఐ మాల్ మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ టి పి సి సంస్థ ఏర్పాటులో ఇప్పటికే కుందనపళ్లి మల్యాలపల్లి రాజాపురం మాతంగి కాలనీ కాజిపల్లి మొగల్పహాడ్ మేడిపల్లి బుచ్చయ్యపల్లి కృష్ణానగర్ మల్కాపురం ఎలుకలపల్లి వీర్లపల్లి లక్ష్మీపురం న్యూ పోరత్పల్లి గ్రామాల ప్రజలు నేటికీ పూర్తిస్థాయి నష్టపరిహారం లేక తమ కుటుంబాలను చిద్రం చేయడం జరిగింది. శాస్త్రీయ పునరావాసం కల్పించాల్సిన ఎన్ టి పి సి యాజమాన్యం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది.

ఎన్ టి పి సి యాజమాన్యం తప్పుడు నివేదికలు ప్రజాభిప్రాయ సేకరణలో ప్రదర్శించి క్లియరెన్స్ టి ఓ ఆర్ తెచ్చుకున్నారు. మరిన్ని పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజాభిప్రాయ సేకరణకు ఎన్టిపిసి రామగుండం విస్తరణ ప్రాజెక్టు కు పూనుకుంటున్నది. ఈ ప్రాంత ప్రజలను చట్టం తెలియని అమాయకులుగా భావించి తాము రాసినవే గొప్పవి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎన్టిపిసి ఏర్పాటులో భూములు ఇచ్చిన వారికి నేటికీ ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేకపోగా మళ్లీ భూసేకరణ పేరుతో ముందుకు వస్తూ నిర్బంధం నీడలో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతూ ఇక్కడి ప్రాంత ప్రజల పోరాటాన్ని తక్కువగా చూపే ప్రయత్నం ఎన్ టి పి సి యాజమాన్యం కొనసాగించడం తీవ్ర ఆక్షేపనీయం అభ్యంతరకరం.

ఈ విధానాన్ని రామగుండం పారిశ్రామిక ప్రజలంతా తీవ్రంగా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిస్తున్నాం. ఎన్టిపిసి ఏర్పాటులో భూ నిర్వాసితులైన వారికి ఇచ్చిన హామీలను మొదటగా అమలు జరిపిన తర్వాత విస్తరణ కోసం భూసేకరణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీసు పహారా మధ్య ప్రజలను స్వచ్ఛందంగా తమ అభిప్రాయాలను చెప్పుకునే వీలు లేకుండా నిర్బంధాన్ని ఉపయోగించి తమ అనుకూల శక్తులచే అనుకూల మాటలు మాట్లాడించుకొని సంబరపడి ఇక్కడి ప్రజలను ఇక్కడ యువతను గాలికి వదిలేసే చర్యలను విడనాడాలని ఎన్టిపిసి యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రజలు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ప్రజాస్వామ్య వాతావరణం మధ్యల తమ అభిప్రాయాలు చెప్పుకునే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.

నేడు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా నిర్బంధం నీడలో జరిగినందున దానిని రద్దుచేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎన్టిపిసి ఏర్పాటు సందర్భంగా 25 వేల కుటుంబాలు కారు చౌక లో తమ శాశ్వత జీవనాధార వ్యవసాయ భూ ఉపాధిని త్యాగం చేసిన రైతులకు యువతకు భూసేకరణలో భూమి కోల్పోయిన కారణంగా 15 పట్టుమని 100 ఉద్యోగాలు కూడా ఇవ్వని ఎన్టిపిసి యాజమాన్యం నేడు మరొక్కసారి ప్రజలను మళ్లీ మోసగించేందుకు ముందుకు వస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎన్టిపిసి యాజమాన్యం చేస్తున్న కుటిల ప్రయత్నాలను త్రిప్పి కొట్టాలని ప్రజలంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాం ఇంకా ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ మాల్ మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులు తోకల రమేష్ గొల్లపల్లి చంద్రయ్య, మార్త రాములు, ఆడెపు శంకర్, గూడూరి వైకుంఠం, కలవల రాయమల్లు తూల్ల శంకర్, ఇనుగాల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App