TRINETHRAM NEWS

ఉద్యాన సహాయకుల హేతుబద్ధీకరణ తక్షణమే నిలుపుదల చేయాలి – శెట్టిరాజు

ఆర్టి కల్చర్ సంఘం జిల్లా అధ్యక్షుడు – శెట్టి రాజు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, అల్లూరిజిల్లా ఇంచార్జ్: అల్లూరిజిల్లా, ఉద్యాన సహాయకుల హేతుబద్దికరణ తక్షణమే నిలుపుదల చేయాలి.
జిల్లాలోని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఉద్యాన పంటలు విస్తీర్ణం, ఆధారంగా ప్రస్తుతం మండల వారీగా అవసరమైన చోట ఉద్యాన సహాయకులు గా అల్లూరి జిల్లా వ్యాప్తంగా 122 మందిని నియమించి ఉన్నారు. వీటితోపాటు ఉద్యాన పంటలు విస్తీర్ణం ను పరిగణలోకి, తీసుకుని అదనంగా 76 ఉద్యాన సేవకులు పోస్టులు అవసరమై ఉన్నది. రాష్ట్రంలో కూడా జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో ఉద్యాన పంటలు విస్తీర్ణాన్ని పరిగణలో తీసుకోని ఉద్యాన సహాయకులకు నియమించి వున్నారు. కానీ ఉద్యాన సహాయకుల హేతుబద్దికరణ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యాన సహాయకుల స్థానంలో వ్యవసాయ సహాయకుల పోస్టులను నియమించాలని ఉన్నత అధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదు. ఈ ప్రక్రియ కొనసాగితే కొన్ని మండలాలలో ఉద్యాన సహాయకులు పోస్టులు పూర్తిస్థాయిలో కుదిరించబడుతుంది.
ఈ విధమైన హేతుబద్దికరణ వలన ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉద్యాన సహాయకులతో పాటు, ఉద్యాన పంటలు పండించే రైతులకు మరియు గిరిజన ప్రాంతంలో ఇప్పుడిప్పుడే ప్రత్యామ్నాయ పంటలలో భాగంగా ఉద్యాన పంటలవైపు మొగ్గు చూపుతున్న రైతులకు భవిష్యత్తులో తీవ్రమైన నష్టం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా వాణిజ్యపరమైన ఉద్యాన పంటలు లక్షలాది ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నప్పటికీ, ప్రస్తుత వ్యవసాయ అధికారులు వాటిని పక్కన పెట్టి ఉద్యాన సహాయకుల చేతుల్లో సంకెళ్లు పెట్టి వారిని బానిసల్లాగా కేవలం వ్యవసాయ శాఖ పనులకు మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తూ ఉద్యాన సహాయకులకు తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తూ, ఉద్యాన సహాయకులు చేయవలసిన ఉద్యాన వృత్తికే తీవ్రమైన అన్యాయం చేస్తూ,
ఇష్టారాజ్యంగా ఏకపక్షంగా వ్యవసాయ అధికారాలు వ్యవహరించడం సరికాదు. గిరిజన ప్రాంతంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలుగా ఉద్యాన వాణిజ్యపరమైన పంటలు వాటి విస్తీర్ణం అభివృద్ధికి కృషి చేయుట కొరకు ఉద్యాన సహాయకుల అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆ రకమైన ఆలోచన చేయకుండా వ్యవసాయ అధికారులు ఉద్యాన సహాయకులకు తప్పుదోవ పట్టిస్తున్నారు. కావున ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు ఆ రకమైన ఆలోచనలు విరమించుకోవాలి.
అదేవిధంగా ఉద్యాన శాఖ అధికారులు జోక్యం చేసుకొని, తక్షణమే ఉద్యాన సహాయకులకు ఉద్యాన శాఖలో విలీనం చేస్తూ పూర్తిస్థాయిలో ఏజెన్సీ ప్రాంతంలో వాణిజ్య పరమైన ఉద్యాన పంటలు అభివృద్ధికి తోడ్పడే స్వేచ్ఛ ఉద్యాన సహాయకులకు కల్పించాలని, ఈ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా జరగాలని ఒక ప్రకటనలో కోరడమైనది. లేనిపక్షాన ఆందోళన చేపడతామని, ఉద్యాన సహాయకుల సంఘం అధ్యక్షుడు శెట్టి రాజు డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App