TRINETHRAM NEWS

Ration cards will be issued soon to those who do not have ration cards

వాన కాలం పంట నుండి రైతులకు 500/- రూపాయల బోనస్ ఇస్తాం..

రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు త్వరలోనే జారీ చేస్తాం..

పెద్దపల్లి మండలం, తుర్కలమద్దికుంట గ్రామంలో

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి నుండి తుర్కలమద్దికుంట అలాగే తుర్కల మద్దికుంట నుండి కాచాపూర్ వరకు డబల్ రోడ్డు నిర్మాణం అలాగే ఆంజనేయ స్వామి ఆలయం నుండి మద్దికుంట పాఠశాల చౌరస్తా వరకు 1200 మీటర్ల సి.సి రోడ్డు నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు మరియు సంబంధిత ఇంజనీరింగ్ శాఖ ఎ.ఈ మరియు గ్రామస్తులతో కలిసి పనులను పర్యవేక్షించడం జరిగింది..

తదుపరి గ్రామస్తులు ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం గౌరవ ఎమ్మెల్యే గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు..

గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం 33 ఫిట్ల రోడ్డు వెడల్పుతో పాటు రెండు పక్కల డ్రైనేజీ నిర్మాణం కోసం గ్రామస్తుల ఆలోచనతో ముందుకు పోవడం జరుగుతుందని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు.రోడ్డు వెడల్పు లో భాగంగా 4 నుండి 5 ఇండ్లు సంబందించిన సమస్య ఉంటే మా గ్రామ నాయకుల సహకారంతో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేసి వారందరికీ నష్టం కాకుండా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులందరి ముందు హామీ ఇవ్వడం జరిగింది.

గ్రామంలో ఉన్న సమ్మక్క- సారళమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా హనుమాన్ విగ్రహం నుండి కెనాల్ ద్వారా మేరపల్లి, తెనుగుపల్లి వెళ్లే మార్గంలో రోడ్డు నిర్మాణం కోసం ప్రపోసల్ చేయడం జరిగింది అని దానితో పాటు రాబోయే సమ్మక్క సారళమ్మ జాతర వరకు సి.సి రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు.

కాచపూర్ నుండి మద్దికుంట మార్గం మధ్యలో ఉన్న 2 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం కోసం సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడం జరిగింది అలాగే ఎన్నికల సమయంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటి ఇంటికి విజ్జన్న నినాదంతో మద్దికుంట గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తులు రోడ్డు కావాలని అడగడంతో ఆరోజు ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు నిర్మాణం దసరా వరకు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.

ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వనిది అని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ 2 లక్షల రుణమాఫీ ప్రకటించారని ఎన్నికల హామీకి కట్టుబడి ఉండి రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. అర్హులైన ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుతుందని ప్రతిపక్షాలు చేసే విమర్శలను రైతుల నమ్మకూడదని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల సాంకేతిక లోపాల వల్ల, మరికొన్ని చోట్ల బ్యాంకుల తప్పిదం వల్ల రైతులకు రుణమాఫీ అందలేదని వాటన్నిటిని సవరించి పూర్తిస్థాయిలో రుణమాఫీ అందజేస్తామని రైతులు నిరాశ చెందవద్దని పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పాతాళ లోకంలో పడదేసిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు కొన్నిచోట్ల రైతుల ముసుగులో రుణమాఫీ ఆందోళనలు పాల్పడుతున్నారని వారికి రైతులే తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. రుణమాఫీ ఫై తోడు దొంగలైన కేటీఆర్, హరీష్ రావులు అబద్దాలతో పోటీపడి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు.అలాగే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతుల ప్రాణాలను బలి తీసుకుందని విమర్శించారు. బిజెపి పార్టీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రుణమాఫీ చేయలేదని ఎద్దేవా చేశారు..

ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App