బాపట్ల లో ఘనంగా రామానుజన్ డే వేడుకలు
బాపట్ల పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఘనంగా రామానుజన్ డే వేడుకలు నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్తగా పేరుపొందిన శ్రీ రామానుజన్ జన్మదిన వేడుకలు సందర్భంగా అసెంబ్లీని ఏర్పాటు చేసి రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గణిత ఉపాధ్యాయులుపి. సుబ్బరామయ్య ఆధ్వర్యంలో అన్ని తరగతుల విద్యార్థులకు క్విజ్, మోడల్ మేకింగ్ మొదలైన పోటీలను విద్యార్థులకు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తరువాత రామానుజన్ గారి నెంబర్ గా పిలవబడే 1729 నెంబరు 600 మంది విద్యార్థులను కూర్చుండబెట్టి ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వి.ఎస్. రఘురాం , ఉపాధ్యాయులు: పి.బి శర్మ, అన్వర్ భాష, విద్యార్థినీ విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించారు.