TRINETHRAM NEWS

Ramagundam MLA Raj is with the people to solve the problems as part of public governance

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఎన్నికల ముందు గడపగడప కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం,గెలిచిన తర్వాత అధికారులతో వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ప్రకారం గడపగడపకు తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న
ఈరోజు 38వ డివిజన్ ఇంద్ర నగర్ లో మొదలుపెట్టి,సంజయ్ గాంధీనగర్,రాజీవ్ నగర్ తో పాటు పలు విధులు గడపగడపకు తిరుగుతూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
గోదావరిఖని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రజా పాలన అందించే దిశగా నేటినుండి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు.

ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38 వ డివిజన్ ఇందిరానగర్ లోని కాలనిలలో ఇంటింటికి తిరుగు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట నగర మేయర్ అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, రామగుండం తహసీల్దార్ కుమార్ స్వామి సంబంధిత అధికారులు ఉన్నారు. డివిజన్ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..రామగుండంకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు 100 కోట్ల ప్రత్యేక నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులతో పాటు డివిజన్ ప్రజలు సహకరించాలని కోరారు. డివిజన్లలో అంతర్గత రోడ్లతో పాటు డ్రైనేజీ మరుగుదొడ్లు, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరచాలన్నారు.

అలాగే ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు., ప్రతి ఇంటికి మంచినీటి సమస్యను పరిష్కరించాలి వర్షాకాలంలో మురికి కాలువలో ముందస్తుగా క్లీన్ చేయాలని ప్రతి రోడ్డు మరియు డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్, ప్రతి వాడలోచెత్త చదరం లేకుండాచెత్త వేయడానికి చెత్తకుండీ ఏర్పాటు చేయాలి మున్సిపాలిటీ అధికారులతో చెప్పారు,,
షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి, మరియు నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డు లేని వాళ్లకు బిపిఎల్ సర్టిఫికెట్, నిరుపేద కుటుంబాలకుచదువుతున్న విద్యార్థులకు ఇన్కమ్ రెసిడెన్సి క్యాస్ట్ సర్టిఫికెట్ విషయంలో, ఇవన్నీ సమస్యల విషయంలో ప్రజా పాలన లో భాగంగా రెవెన్యూ అధికారులకు ఆదేశించారు, ప్రభుత్వ స్కూల్స్ సమస్యలు ఎంఈఓ అధికారులతో ఇంద్రనగర్లో ప్రాథమిక పాఠశాలలో సందర్శిస్తూ విద్యార్థులను విద్య విషయంలో భోజనాల విషయంలో తెలుసుకుంటూ ఉపాధ్యాయులకు సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది సమస్యలను తెలియజేసిన ఉపాధ్యాయులకు అధికారులు సహకరించి ఉన్న సమస్యల వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరడం జరిగింది
ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో
కరెంట్ కోతలు లేకుండా 24 గంటలు ప్రతి ఇంట్లోవెలుగుండే విధంగా,చూడాలని పలువాడలలో ట్రాన్స్ఫార్మర్స్ మరియు కరెంట్ లైన్స్ ఏర్పాటు చేయాలని, హెల్త్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డిఎంహెచ్ఓ అధికారులతో,ఎన్టిపిసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అధికారులు తో, ఆర్ ఎఫ్ సి ఎల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అధికారులతో
ఆర్ ఎస్ ఎల్ డ్రైనేజ్ వాటర్, పక్కనున్న చెరువు నీళ్లు ఓవర్ ఫ్లో వలన చుట్టుపక్కల ఉన్న వాడలలో రాకుండా తక్షణమే పరిష్కరించాలని ఈ సమస్యను అదేవిదంగా
ఆర్ఎస్ఎల్ చుట్టుపక్కల ఉన్న రోడ్స్,మరియు పలు సమస్యలను పరిష్కరించాలని అదేవిధంగా ఆర్ఎస్ ఎల్ లో చదువుకున్న యువకులకు ఉపాధి కల్పించాలని,పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులను కోరుతూ,డ్రంక్ అండ్ డ్రైవ్,గంజాయి అలవాటు, ప్రజా పాలనలో ప్రజలకు రక్షణగా ఉండాలని

ఈ కార్యక్రమంలో మున్సిపల్,అధికారులు మరియు రెవెన్యూ అధికారులు,ఎన్టిపిసి హెచ్ఆర్ అధికారులు, ఆర్ఎస్ఎల్ అధికారులు,హెల్త్ డిపార్ట్మెంట్అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు,మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగల అధ్యక్షులు, సోషల్ మీడియా,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramagundam MLA Raj is with the people to solve the problems as part of public governance