TRINETHRAM NEWS

రామగుండం కార్పొరేషన్ ఇంచార్జ్ కమిషనర్ అరుణ అడిషనల్ కలెక్టర్ ధన్యవాదాలు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ పీకే రామయ్య కాలనీ లో గత మూడు నెలల నుండి మంచినీళ్ల మోటర్ ఖరాబ్ కావడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు త్రాగు నీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని మడిపెల్లి మల్లేష్ కు అక్కడి ప్రజలు తెలపడంతో వెంటనే స్పందించి రామగుండం కార్పొరేషన్ ఇంచార్జి కమిషనర్ అరుణ అడిషనల్ కలెక్టర్ తెలపడంతో వెంటనే అరుణ మున్సిపల్ సిబ్బందికి మోటర్ మరమ్మతు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో శుక్రవారం రోజున సిబ్బంది వచ్చి మోటర్ రిపేర్ చేసి ప్రజలకు నీటి సౌకర్యాన్ని కల్పించారని రెండోవ డివిజన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ తెలిపారు ఈ సందర్భంగా మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ పీకే రామయ్య కాలనీలో గత పాలకుల నిర్లక్ష్యంతో నీటి సౌకర్యం, మరియు రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని పీకే రామయ్య కాలనీలో పూర్తిగా కూలి పని చేసుకునే సుమారుగా 500 కుటుంబాలు ఉన్నాయని వీరికి కనీస సౌకర్యాలు కల్పించడంలో గత పది సంవత్సరాలు పాలన చేసిన పాలకులు మరియు అధికారులు విఫలమైనారని వీరిని పట్టించుకునే వారు కూడా లేరని ఐదు సంవత్సరాల క్రితం నా సొంత డబ్బులతో బోర్లు వేసి రెండు వేల లీటర్ల ట్యాంకులు 11 గల్లీలకు పెట్టి ప్రజలకు నీటి సౌకర్యం కల్పించామని మడిపెల్లి మల్లేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు భరత్ నగర్ బోర్డు నుండి పీకే రామయ్య కాలనీ మెయిన్ రోడ్డు15 సంవత్సరాల క్రితం సిసి రోడ్డు వెయ్యడం జరిగిందని ఆ రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ఆ దారిన నిత్యం వందలాది మంది ప్రజలు వెళ్తూ ఉంటారని రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో స్కూల్ వెళ్లే పిల్లలు మరియు ఆటోలో వెళ్లి వారు గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఈ యొక్క రోడ్డు వేయడం కోసం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిధులు కూడా మంజూరు చేశారని టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారని దయచేసి సంబంధించిన కాంట్రాక్టర్ ను రోడ్డును వేసేలా ఆదేశాలు ఇవ్వాలని రామగుండం కార్పొరేషన్ ఇంచార్జి కమిషనర్ అరుణ అడిషనల్ కలెక్టర్ కోరుతున్నానని మడిపెల్లి మల్లేష్ అన్నారు శుక్రవారం రోజున మున్సిపల్ సిబ్బందితో మోటర్ మరమ్మతు చేయించి పీకే రామయ్య కాలనీ ప్రజల నీటి ఎద్దడి తీర్చినందుకు రామగుండం కార్పొరేషన్ ఇంచార్జి కమిషనర్ అరుణ శ్రీ అడిషనల్ కలెక్టర్ మరియు మునిసిపల్ సిబ్బందికి రెండో డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మడిపెల్లి మల్లేష్ అన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App