TRINETHRAM NEWS

బాలికల వసతి గృహంలో ఘనంగా రమాబాయి అంబేద్కర్ జయంతి కార్యక్రమం

అంబేద్కర్ లక్ష్యసాధనలో రమాబాయి కీలక తోడ్పాటు … జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, కాశి నవీన్ కుమార్

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 07 : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని స్థానిక జాంపేటలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని రమాబాయి చిత్ర పటానికి ఘనంగా నివాళులర్పించారు. వసతి గ్రహం లోని బాలికలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం రమాబాయి అంబేద్కర్ జీవితం, ఆమె చేసిన సేవల గురించి వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ లక్ష్యసాధనలో రమాబాయి అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని, కుటుంబ బాధ్యతలతో పాటు అంబేద్కర్ ఆలోచనలకు బలాన్నిచ్చి, ఆయనను సామాజిక న్యాయ పోరాటానికి అన్ని విధాలా మద్దతుగా నిలిచారని అన్నారు. ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, మహిళలు పురోగమించాలని, సమాజ నిర్మాణంలో కీలక భూమిక పోషించాలని సూచించారు.

కాశి నవీన్ కుమార్ మాట్లాడుతూ, రమాబాయి అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆమె అంబేద్కర్ విజయానికి వెన్నుదన్నుగా నిలిచారని పేర్కొన్నారు. సమాజంలోని దళితుల హక్కుల కోసం పోరాడి, అంటరానితనాన్ని రూపుమాపిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఉన్నత చదువులు పూర్తి చేయడానికి, ఉన్నతమైన ఆలోచనలతో పోరాటాలు చేయడానికి ఆయన సతీమణిగా రమాబాయి అందించిన మద్దతు జాతి ప్రజలంతా గర్వించదగ్గరన్నారు.

ఈ కార్యక్రమంలో తాళ్లూరు బాబు రాజేంద్రప్రసాద్, కోరుకొండ చిరంజీవి ల, దారా యేసురత్నం, పాము బాబురావు, కప్పల వెలుగు మోత నాగలక్ష్మి, తురకల నిర్మల, ద్వారా పార్వత సుందరి, మర్రి బాబ్జి, సిహెచ్ సుబ్బారావు, కుడిపూడి పార్థసారథి, అద్దాల కుమార్ బాబు, మారే వెంకటేశ్వరావు, పులిదిండి ఆనందకుమార్, టీ ప్రభాకర్ మరియు వసతి గృహ విద్యార్థినులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramabai Ambedkar Jayanti