
వెబ్ సైట్ సర్వర్ పని చేయకపోవటంతో నిరుద్యోగ యువతీ యువకులు తీవ్ర ఇబ్బంది.
డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 12 త్రినేత్రం న్యూస్. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువు ఎళ్లుండితో(14) సోమవారంతో ముగియనుంది. ఐతే 2,3,రోజులుగా వెబ్ సైట్ సర్వర్ డౌన్ అవుతుండడంతో అభ్యర్థులు, నిరుద్యోగ యువతీ యువకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వివరాలు నమోదు చేస్తుండగానే వెబ్ పేజీ నిలిచిపోతుంది, దీంతో మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుంది ఈ సమస్యను పరిష్కరించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా దరఖాస్తుదారులు ఇంకా చాలా మంది మిగిలి ఉన్నారు. అంతేకాకుండా ఆన్లైన్ సర్వర్లు ఇప్పుడు బిజీ రావాలంటే దరఖాస్తులు నందకూరిగా సాగుతున్నాయి అదేవిధంగా కుల ఆదాయం ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాల వద్ద రోజుకు క్యూ పెరుగుతుంది.
అదేవిధంగా మండల తహసిల్దార్ కార్యాలయంలో కుల ఆదాయం సర్టిఫికెట్లు త్వర త్వరగా అవుతున్నప్పటికీ ఆన్లైన్లో అప్లై చేసుకుందామనుకుంటే సర్వర్లు బిజీ ఉండడంతో దరఖాస్తుదారుల్లో టేన్షన్ నేల్కొని ఉంది. వెబ్ సైట్ సర్వర్ డౌన్ కారణంగా మరి కొన్ని రోజులు గడువు పొడిగిస్తే బాగుంటుందని పలువురు నిరుద్యోగ యువతీ యువకులు అభిప్రాయ పడుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
