హైదరాబాద్: గచ్చిబౌలి ర్యాడిసన్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తోన్న క్రమంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన డ్రగ్ సరఫరాదారుడిగా ఉన్న మీర్జా వహీద్ బేగ్‌ను పోలీసులు విచారించి, రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు పొందుపర్చారు. స్నాప్‌చాట్‌లో చాటింగ్ చేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. గత నెల 29న బేగ్‌ను అరెస్టు చేసి అతని వద్ద 3.58 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
ఫిబ్రవరిలో 10 సార్లు బేగ్ డ్రగ్స్ సరఫరా చేసినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఇందులో క్రిష్ పేరును మరోమారు ప్రస్తావించారు. బేగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు రెండు దఫాల్లో నిందితులు అతనికి రూ.30వేలు గూగుల్ పే ద్వారా చెల్లించారు. ఫిబ్రవరి 24న జరిగిన పార్టీలో 10 మంది పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు లిషిత, నీల్, సందీప్, శ్వేత ఇంకా పరారీలోనే ఉన్నారు. వీరందరికీ నోటీసులు అందినా ఎలాంటి స్పందనలేదు. నీల్ విదేశాలకు పారిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ కేసులో పురోగతి సాధించేందుకు పోలీసులు శతవిధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. దర్శకుడు క్రిష్ సోమవారం మరోసారి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.
ర్యాడిసన్ డ్రగ్స్ కేసు
Related Posts
TWJF appeal to CM Revanth : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి : -సీఎం రేవంత్ కు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి
TRINETHRAM NEWS జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి-సీఎం రేవంత్ కు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలుతొలి టర్మ్ లొనే కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం…
మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధవహించాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
TRINETHRAM NEWS మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధవహించాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … Trinethram News : Medchal : ఈరోజు 125 – గాజుల రామారం డివిజన్ చింతల చెరువు వద్ద నిర్వహించిన చేప పిల్లల విడుదల కార్యక్రమానికి…