
తాబిత ఆశ్రమంలో ఘనంగా పులవేన క్రాంతి గారాల పట్టి చిన్న కుమార్తె క్రితి నందన మొదటి పుట్టిన రోజు వేడుకలు
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా రామగుండంలోనీ తబిత ఆశ్రమంలో ఆశ్రమ పిల్లల సమక్షంలో గత 10సంవత్సరాలుగా క్రాంతి అనితల దంపతుల చిన్న కుమార్తె క్రితి నందన మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్,37 డివిజన్ కార్పొరేటర్ పెంట రాజేష్ లో హాజరయ్యారు. అనంతరం 50 వేల నగదు మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా తబితా ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్ కు అందించారు. అనంతరం ఆశ్రమంలోనీ చిన్నారులకు చలికాలం అవసర నిమిత్తం 50 వేల విలువగల స్వెటర్లు అనిత క్రాంతి కుమార్ దంపతుల చేతుల మీదుగా అందించారు. గత పది సంవత్సరాలుగా తబిత ఆశ్రమంలో క్రాంతి కుమార్ కూతుర్ల పుట్టినరోజు వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం తబితా నిర్వాహకులు వీరేంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెంట రాజేష్ లతో పాటు తదితరులు అభినందించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
