TRINETHRAM NEWS

యూత్ కాంగ్రెస్ NSUI ఆధ్వర్యంలో నిరసన

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో శాంతియుతంగా కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర పై అస్సాం లో బీజేపీ గూండాలు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ.., ఈరోజు కొత్తగూడెం పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద యువజన కాంగ్రెస్ మరియు NSUI ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మా అగ్రనేత రాహుల్‌ గాంధీ నాయకత్వంలో నిరాటంకంగా సాగిపోతున్న యాత్ర కోట్లాది ప్రజల హృదయాలను కలుపుతూ, వారిని చైనత్యపరుస్తూ దూసుకుపోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. అందుకే హిమంత్‌ బిస్వా శర్మ అవినీతి, నిరంకుశ పాలనలో గత కొన్ని రోజులలుగా ఇటువంటి నీచ దుశ్చర్యలకు, కుట్రలకు బీజేపీ పదేపదే పాల్పడుతోందని ఆరోపించారు. ఈ తరహా చర్యలకు స్వస్తి పలకాలని సూచించారు.ఈ నిరసన కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డ నా శేఖర్, యువజన కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడారి ప్రదీప్ కుమార్, NSUI జిల్లా అధ్యక్షుడు అజ్మీర్ సురేష్ నాయక్, కొత్తగూడెం టౌన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ కార్యదర్శి కంది శివకుమార్, బాబీ,దీపక్,గౌతం,మోహిన్, అమీర్, రమేష్,విజయ్, శ్యామ్ అజయ్ తదితరులు పాల్గొన్నారు…