The promotions of teachers which have been pending for a decade
Trinethram News : దశాబ్దకాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులు…ఆరు నెలలోనే పూర్తిచేసిన సియం రేవంత్ రెడ్డి సారద్యం లోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం
- ప్రతి గూడెం లో పాఠశాల ఉండాలని ఉపాధ్యాయుడు ఉండాలని అనే నినాదం విద్యాశాఖ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి కి నిదర్శనమన్నారు
- A.K ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టెబోయిన అనిల్ కుమార్
నాగార్జునసాగర్ నియోజకవర్గం
దశాబ్దకాలంగా ఎన్నికల ముందు రేపు మాపు అంటూ ఊరిస్తూ తర్వాత ఉపాధ్యాయుల పదోన్నతుల గురించి ఊసే ఎత్తని గత ప్రభుత్వం..కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లో నిరీక్షణకు తెరపడింది అని దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేలాది మందికి పదోన్నతులు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వనికే దక్కుతుంది అని A.K ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టెబోయిన అనిల్ కుమార్ హాలియా లో తన నివాసం లో హర్షం వ్యక్తం చేశారు 2015 నుండి ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించకపోవడంతో వేలాది మంది పదోన్నతులు రాకుండానే ఉద్యోగ విరమణ పొందడం జరిగిందని చెప్పారు.1800 మంది స్కూల్ అసిస్టెంట్ లకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పదోన్నతి కల్పించగా,10500 మంది లాంగ్వేజ్ పండిత్ లు వ్యాయామ ఉపాధ్యాయులకు ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కల్పించారని చెప్పారు.మరో 10000 మంది ఎస్జిటీ లకు స్కూల్ అసిస్టెంట్, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులుగా వివిధ సబ్జెక్ట్ లలో పదోన్నతి కల్పించడం చారిత్రాత్మమైనదని అన్నారు.పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించడంతో యావత్ తెలంగాణ రాష్ట్ర ఉపాద్యాయులు, ఉపాధ్యాయుల సంఘాలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గూడెంలో పాఠశాల వుండాలని చెప్పడంతో పాటు ఒక ఉపాధ్యాయుడు వుండాలని చెప్పడం విద్యాశాఖ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.గత ప్రభుత్వంలో నిరాదరణకు గురైన విద్యాశాఖకు బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App