TRINETHRAM NEWS

కబడ్డీ పోటీ విజేతలకు బహుమతులు

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో శనివారం డిండి మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాల ఆవరణలో కబడ్డీ పోటీలను నిర్వహించారు. మండల స్థాయి కబడ్డీ పోటీలను అడిషనల్ ఎస్పి మౌనిక ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, దేహదారుడ్యాన్ని పెంపొందిస్తాయని ఆమె అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని క్రీడాకారులు ఆటలను స్ఫూర్తిగా తీసుకొని ఆటల్లో పాల్గొని ఆడాలని ఆమె తెలిపారు.

కబడ్డీ పోటీల్లో మొదటి బహుమతి చెరుకుపల్లి టీం గెలుచుకుంది. ద్వితీయ బహుమతి డిండి టీం గెలుచుకున్నది. తృతీయ బహుమతి నాగార దుబ్బ తండా టీమ్ లు సాధించాయి, గెలుపొందిన వారికి నగదుతో పాటు షీల్డ్ లు అందించారు.

ఈ కార్యక్రమంలో సిఐ సురేష్ ఎస్సై రాజు, ఎంఈఓ గోపియా నాయక్, స్పోర్ట్స్ క్లబ్ డిండి సభ్యులు, చైతన్య యోజన సంఘం సభ్యులు, నాయకులు క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kabaddi competition