TRINETHRAM NEWS

Principal harassing the employees who came through the bridge

ఆస్పత్రికి సంబంధం లేకున్న మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభుత్వ ఆస్పత్రి పై పెత్తనం

వారధి ద్వారా వచ్చిన వారిని తొలగించి ఏలైన్ కాంట్రాక్ట్ సంస్థకు ఇచ్చి తనకు నచ్చిన వారిని నియమించి అమ్ముకోవాలని చూస్తున్న ప్రిన్సిపల్

కాంట్రాక్టర్లు ప్రిన్సిపాల్ కుమ్మక్కై ఉద్యోగాలలో అనేక అవకతవకలు

ఎమ్మెల్యే మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, సుపరిడెంట్ లను బదిలి చేయాలి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖనిలోని మెడికల్ కళాశాలలో వారధి ద్వారా ఉద్యోగం పొందిన 31మంది ఉద్యోగులు, 2022 జూన్ లో వారధి సొసైటీ ద్వారా తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరో గ్య శాఖ ఆధ్వర్యంలో రామగుండం మెడికల్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకం జరిగిందని, అందులో వివిధ విభాగాలలో పలుపోస్ట్లు ఖాలీ సందర్భంగా స్టోర్కిపర్, క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, నాలుగు ల్యాబ్ అటెండెంట్స్, రెండు రికార్డు అసి స్టెంట్, నాలుగు డిస్పెక్షన్ హాల్ అటెండెంట్స్, నాలుగు థియేటర్ అసిస్టెంట్, ఎనిమిది బుక్ బేరర్, డఫ్టర్, ఆఫీస్ సబ్ ఆర్డినేటర్, సబార్డినేట్ స్టాఫ్ నియామకాలు పరదర్శంగా జరిగాయని, అయితె వీరిని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మద్దెల దినేష్ పేర్కొన్నారు.
అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ వారధి ద్వారా వచ్చిన ఉద్యోగులకు మూడు నెలలుగా వీరికి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని దానితో ఉద్యోగులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.

సంవత్సరానికి 31మంది స్టాఫ్ను ఎక్స్టెన్షణ్ ద్వారా పొడిగించాల్సి ఉంటుందని మూడు నెలలుగా పొడగింపు ఇవ్వకపోవడం, వేతనాలు రాకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారన్నారు.

అయితే ఈ ఉద్యోగులు వారధి ద్వారా వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న తరుణంలో వారధి నుండి వీరందరినీ తొలగించి ప్రిన్సిపల్ మెడికల్ కళాశాల లో ఉన్న ఎలైన్ కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించాలని చూస్తున్నారని, ఇలైతే ఏదో సాకుతో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి తనకు నచ్చిన వారిని ఏర్పాటు చేసుకొని ఉద్యోగాలను అమ్ముకోవాలని చూస్తున్న ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు డి ఏం ఈ, ఆరోగ్య శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ను కోరడం జరుగుతుందన్నారు.

అసలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి సంబంధం లేకున్న ఆస్పత్రిలో పేరుకే సుపరిడెంట్ ను కూర్చోపెట్టి పెత్తనం అంత ప్రిన్సిపల్ నడిపిస్తూ కొంతమంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది నల్గురు, ఐదుగురిని దళారులను ఏర్పాటు చూసుకొని ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడుతూ ఆస్పత్రిని, మెడికల్ కళాశాల నిర్వహణను అస్తవ్యస్తం చేస్తుందని అని అగ్రహం వ్యక్తం చేశారు.

ప్రిన్సిపల్ దళారులను ఏర్పాటు చేసుకొని ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న కొంతమంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఫోటోలు తీస్తూ, ప్రిన్సిపల్ కి పంపిస్తూ వారిని నాన బూతులు తిడుతూ మానసికంగా ఇబ్బందులు చేస్తున్న వారిని ప్రిన్సిపల్ గారు మరియు కాంట్రాక్టర్లు ప్రోత్సహించడం సరికాదని, తప్పు చేస్తున్న వారిని శిక్షించడం పోయి ప్రోత్సహించడం సిగ్గు చేటన్నారు.

అస్పత్రికి శనిలా దపురించిన ప్రిన్సిపల్ ని మరియు పేరుకే సుపరిడెంట్ గా ఉన్న సుపరిడెంట్ ని బదిలి చేయాలని జిల్లా కలెక్టర్ డిఏంఈ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, మరియు రామగుండం ఎమ్మెల్యే గార్లను కోరడం జరిగిందన్నారు.

ఇప్పటికే మెడికల్ కళాశాలలో ఏలైన్ కాంట్రాక్ట్ సంస్థ 76 ఉద్యోగాలకు 71 పోస్టులను ప్రిన్సిపల్ మరియు కాంట్రాక్టర్ కు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు అవగాహన, అనుభవం లేని వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, ఇంకో ఐదు పోస్టులు ఉన్నప్పటికీ అమ్ముకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

ప్రస్తుతానికి వారధి ద్వారా పనిచేస్తున్నటువంటి 31 మంది ఉద్యోగులను తొలగించి ఎలైన్ కాంట్రాక్టు అప్పజెప్పితే మరియు ఆసుపత్రి మెడికల్ కళాశాలలో నిర్వహణ అస్తవ్యస్తంగా తయారయిందని ఉద్యోగాలలో పారదర్శకం లేదని ఇష్టానుసారంగా ఉద్యోగాలు అమ్మకుంటే ఇక పై ప్రత్యక్ష ఆందోళనలను, పోరాటాలు తప్పవని దినేష్ డిమాండ్ చేశారు. వారధి ద్వారా వచ్చిన ఉద్యోగులకు తక్షణమే వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Principal harassing the employees who came through the bridge