TRINETHRAM NEWS

Trinethram News : ఉక్రెయిన్‌ : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు.అక్కడ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ ఇటీవల రష్యాలో పర్యటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైన కొద్ది రోజుల తర్వాత ఆయన ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు.