ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ
Trinethram News : France : Jan 11, 2025,
ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్ వేదికగా జరగనున్న ఏఐ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వెల్లడించారు. కృత్రిమమేధ వినియోగం, వాటి పర్యవసానాలపై ఈ సదస్సులో చర్చించే అవకాశముంది. “ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు రానున్నారు. ఇక్కడ నిర్వహించబోయే ‘ఏఐ సదస్సు’ ప్రపంచ శక్తుల మధ్య సంభాషణలకు వేదిక కానుంది. అమెరికా, చైనా, భారత్‌తోపాటు పలు గల్ఫ్ దేశాలు ఈ సదస్సుకు హాజరవుతాయి.” అని మేక్రాన్ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App