The task force police seized about 60 quintals of PDS illegally stored in Telukla and Peddapur villages
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండము పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాసులు .ఐపీఎస్., (ఐజీ) ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి జోన్ జూలపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చుట్టప్రక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి తెలుకుంటా గ్రామం లోని ఒక ఇంట్లో అక్రమంగా నిల్వా పిడిఎస్ రైస్ ఉంచారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు మరియు సిబ్బంది ఆకస్మిత తనిఖీ చేయగా ఒక ఇంట్లో సంచులలో నింపిన ఉన్న పిడిఎస్ రైస్ సుమారు 40 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ గలదు అట్టి పిడియస్ రైస్ ఎల్లంకి అర్జున్ కి చెందినదిగా గుర్తించడం జరిగింది.
అదేవిధంగా పెద్దాపూర్ గ్రామం లో ఒక ఇంట్లో పిడియస్ బియ్యన్ని నిల్వ ఉంచారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు సిబ్బంది తనిఖీ నిర్వహించగా బ్యాగ్ లలో నింపి ఉన్న 20 క్వింటాళ్ల పిడియస్ రైస్ చందా భారతి కి చెందినవి గా గుర్తించి పిడిఎస్ రైస్ స్వాధీన పరుచుకోవడం జరిగింది.
రెండు గ్రామాలలో పట్టుకొన్న 60 క్వింటాళ్ల పిడియస్ రైస్ ని తదుపరి విచారణ నిమిత్తం జూలపల్లి పోలీస్ స్టేషన్ వారికీ అప్పగించడం జరిగింది.
నిందితుల వివరాలు
ఎల్లంకి అర్జున్ s/o రామయ్య, వయస్సు 33ముస్లిం,వైశ్య , తెలుకుంట, జూలపల్లి.
(40 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ స్వాధీనం)
చందా భారతి w/o చందా రాజు , పెద్దాపూర్, జూలపల్లి.
(20 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ స్వాధీనం)
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App