తెలంగాణ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది
బి.ఆర్.ఎస్ ప్రజాప్రతినిధులమీద నాయకులపై కక్షసాధింపు చర్యలు
మాజీ మంత్రి కోప్పుల ఈశ్వర్
ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం పోలీస్ మయం అయ్యంది ప్రభుత్వం ఏమి చెబితే పోలీసులు అదే చేస్తున్నారు.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రాష్ట్రంలో ఎన్నడూ చూడని పాలన కాంగ్రెస్ పాలిస్తుందని రాష్ట్రం లో దౌర్జన్యం దమనకాండ కొనసాగుతుందని
మాజీ మంత్రి కోప్పుల ఈశ్వర్ అన్నారు.సోమవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని టి.బి.జి.కె.ఎస్ కార్యాలయం లో మాజీ మంత్రి కోప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ విలేఖరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కోప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని
పోలీసులే ప్రభుత్వం అన్నట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసులు అన్యాయం వైపు నిలుస్తున్నారన్నారు.
రామగుండంలో నలుగురు మహిళా కార్పోరేటర్ల పై పోలీసు ఉన్నతాధికారి అసభ్య పదజాలంతో మాట్లాడడం దారుణమన్నారు.
కృష్ణ నగర్ లో డిప్యూటీ మేయర్ పై పెట్రోల్ పోసిన వ్యక్తి పై పోలీసులు కేసు నమోదు చేయలేదని ఫిర్యాదు చేసిన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానాలు వస్తున్నాయన్నారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని తిలక్ నగర్ , లక్ష్మి నగర్, చౌరస్తాలో నిరు పేదల కట్టడాలు అక్రమంగా కూల్చివేశారు. వారి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా వారి జీవితాలను రోడ్డు పై పడేశారన్నారు. సింగరేణి, మున్సిపల్ అధికారులు
ఈ కుల్చివేతలు ఎందుకు చేస్తున్నారో ఎవ్వరి కోసం నూతన కాంప్లెక్స్ నిర్మాణాలు చేస్తురో సమాధానం చెప్పాలన్నారు.బీ ఆర్ ఎస్ కార్పొరేటర్ అనే ఒకే ఒక్క కారణంతో సిరి ఫంక్షన్ హాల్ కూల్చివేశారని హైకోర్టు నుండి స్తే ఆర్డర్ వున్న కుట్రపూరితంగా కూల్చివేశారన్నారు.
పోలీసులు నిస్పాక్షపాతంగా వ్యవరించాలి.పోలీసులు పాలకుల అదేశాలను అమలు చెస్తాం అన్న తీరు బాగలేదని రామగుండం లో దౌర్జన్యఖండ నడుస్తుందన్నారు.ఈ విలేఖరుల సమావేశం లో రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు కార్పోరేటర్లు కల్వచర్ల కృష్ణ వేణీ కుమ్మరి శ్రీనివాస్ రమణారెడ్డి కవిత సరోజిని నాయకులు నడిపెల్లి అభిషేక్ రావు మేతుకు దేవరాజు నూతి తిరుపతి పిల్లి రమేష్ బుర్ర శంకర్ గౌడ్ సట్టు శ్రీనివాస్ తోకల రమేష్ జడ్సన్ అడ్లూరి రాములు ఇరుగురాళ్ల శ్రావన్ కర్రీ ఓదేలు కొడి రామకృష్ణ ఆవునూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారుl
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App