రాష్ట్రం లో ప్రజాపాలన కాదు పోలీసు పాలన
ప్రశ్నీస్తే కేసులు నిలదిస్తే అరెస్టులా
బీఆర్ఎస్ బద్నాం చేయాలన్న లక్ష్యంతో రాజకీయ కక్షలతో కే.టీ.ఆర్ అక్రమ కేసులు
కె.టీ.ఆర్ పై అక్రమ కేసులు ఎత్తివేయాలి కాంగ్రెస్ 420 హామిలు నేరవేర్చాలని 2 వ రోజు రిలే నిరహరదీక్షలు
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్
రాష్ట్రం లో ప్రజాపాలన కాదు పోలీసు పాలన సాగుతోంది ప్రశ్నీస్తే కేసులు నిలదిస్తే అరెస్టులు బీఆర్ఎస్ను బద్నాం చేయాలన్న లక్ష్యంతో రాజకీయ కక్షలతో కే.టీ.ఆర్ అక్రమ కేసులు పెట్టారని వెంటనే కేసులను ఎత్తివేయాలని రామగుండం మాజీ శాసనసభ్యులు, పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం గోదావరిఖని ప్రధాన చౌరస్త టి.బి.జి.కె.ఎస్ కార్యాలయం ఆవరణలో బి.టీ.ఆర్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 420 హామిలు నేరవేర్చాలని రామగుండం మాజీ శాసనసభ్యులు, పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ రిలే నిరహరదీక్షలు 2 వ రోజుకు చేరుకున్నాయి.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ఫార్ములా ఈ- కార్ రేసింగ్ నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు రాజకీయ కక్షలతో కే.టీ.ఆర్ అక్రమ కేసులు పెట్టారని బీఆర్ఎస్ కేటీఆర్‌ను బద్నాం చేయాలన్న లక్ష్యంతో, అక్రమ కేసులతో కక్ష సాధింపులకు రేవంత్ సర్కార్ దిగుతుందన్నారు. లగచర్ల లో రైతులు భూములు ఇవ్వనందుకు వారిపై కేసులు పెట్టి అనారోగ్యం ఉన్న రైతుకు సంకేళ్లు వేసింది రెవంత్ సర్కార్ అన్నారు. కే.టీ.ఆర్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 420 హామిలు నేరవేర్చాలని .కే.టీ.ఆర్ పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసేదాకా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరహరదీక్షలు సాగుతాయని హెచ్చరించారు. రాబోవు కాలంలో ప్రజా కోర్టులో రేవంత్ సర్కారుకి తగిన శాస్తి జరగడం ఖాయమన్నారు.
ఈ కార్యక్రమం లో మాజీ జడ్పీటీసి అముల నారాయణ కార్పోరేటర్ కుమ్మరి శ్రీనివాస్ బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మూల విజయ రెడ్డి, గోపు అయులయ్య యాదవ్, నూతి తిరుపతి రాకం వేణు మెడి సదయ్య జిట్టవేన ప్రశాంత్ ముదిరాజ్ సింహచలం పరత్నకర్ బోడ్డుపల్లి శ్రీనివాస్ జక్కుల తిరుపతి పోషం కొల సంతోష్ ఆడప శ్రీనివాస్ బాసంపెల్లి జడ్సన్ నీరటి శ్రీనివాస్ పిల్లి రమేష్ బుర్ర శంకర్ గౌడ్ ఇరుగురాళ్ల శ్రావన్ చింటూ రామరాజు వెంకన్న కోడి రామకృష్ణ ఆవునూరి వెంకటేష్ కర్రి ఓదేలు నిట్టూరి రాజు కిరన్ జీ నాగరాజు సారయ్య నాయక్ బచ్చాల రాములు శాంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App