‘పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి’
అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం : పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,
పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, కుటుంబ సభ్యులకు పరామర్శ
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజీ), మంచిర్యాల కలెక్టర్ దీపక్ పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్. పోలిస్ వందనం తీసుకుని, వివిధ సంఘటనలో ఉగ్రవాదులచే, అసాంఘిక శక్తులచే పోరాడి అసువులు బాసిన అమరవీరుల పేర్లను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా అమరులైన పోలీస్ అధికారులు 214 మంది పేర్లను అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు నివాళులు అర్పించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛము ఉంచి సీపీ మంచిర్యాల కలెక్టర్ పెద్దపల్లి డీసీపీ పోలీస్, ఇతర అధికారులు మరియు సిబ్బంది నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ… పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వహించుకోవడం వెనుక సైనికుల వీరోచిత పోరాటం మహోన్నత చరిత్ర దాగుంది. 1959 అక్టోబరు 21న భారత్- చైనా సరిహద్దున సియాచిన్ ప్రాంతంలోని భూ భాగాన్ని ఆక్రమించేందుకు చైనా రక్షణ బలగాలు యత్నించాయి. ఆ సమయంలో డీఎస్పీ కరమ్ సింగ్ ఆధ్వర్యంలో విపరీతమైన చలిలో 10 మంది సీ ఆర్ పి ఎప్ జవాన్లు అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. అక్సాయ్ చిన్ ప్రాంతం లోని హాట్ స్ప్రింగ్ వద్ద జరిగిన పోరాటంలో పది మంది సీ ఆర్ పి ఎప్ జవాన్లు అమరులయ్యారు. భారత దేశ రక్షణ కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి, దేశం కోసం ప్రాణాలు వదిలిన తొలి సందర్భమది.
ఇందుకు గాను అన్ని రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు 1960 జనవరి 9న సమావేశ మయ్యారు. అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించాలని తీర్మానించారు. వీరుల రక్తం పారిన ఆ ప్రదేశాన్ని పవిత్ర స్థలంగా భావించి ఏటా అన్ని రాష్ట్రాల పోలీసులు సందర్శించి నివాళులర్పిస్తున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అక్టోబరు 21ని పోలీసు అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటు అమర పోలీసుల వీరల త్యాగాన్ని స్మరించుకొని వారి కుటుంబాలకు సానుభూతిని, సహకారాన్ని ప్రకటించి వారికి ఘనమైన నివాళులర్పిస్తున్నారు.
పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేం అని వ్యవస్థ సాఫీగా నడవడంలో పోలీసులది కీలకపాత్ర. మావోయిస్టులతో, అసాంఘిక శక్తులతో జరిగే పోరులో అమరులైన పోలీసుల త్యాగాలు అజరామరం. శాంతిభద్రతల పరిరక్షణలో సంఘవిద్రోహక శక్తులకు వ్యతిరేకంగా పోరాడి తమ ప్రాణాలను పణంగా పెట్టారు. పోలీస్ అమరవీరుల త్యాగలు మరువలేనివని,ప్రజల, దేశ రక్షణలో ప్రాణం కoటే విధి నిర్వహణ గొప్పదని చాటిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. వారి త్యాగాలను స్మరించుకునేందుకే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నాం. శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలందిస్తాం. పది రోజుల పాటు పోలీసుల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడుతాం అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం .
త్యాగమూర్తుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు వారి యొక్క సమస్యలను అడిగి వారు చెప్పిన సమస్యలను సాద్యమైనoత తొందరగా పరిష్కరిస్తాం అని అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం అని ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చు. సంస్మరణ దినోత్సవం రోజున పోలీస్ అమరవీరుల పోలీసు కుటుంబాల సభ్యులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు.*
కార్యక్రమం లో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, పెద్దపెల్లి ఏసిపి జి కృష్ణ మంచిర్యాల ఏ సి పి ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు, రామగుండం ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ఏసీపీ ఏఆర్ ప్రతాప్, సుందర్ రావు, సీఐ లు, ఇన్స్పెక్టర్స్, సబ్ఇన్స్పెక్టర్స్, రిజర్వడ్ ఇన్స్పెక్టర్స్, రామగుండము పోలీస్ కమిషనరేట్ పోలీస్ సంఘం అద్యక్షులు బోర్లకుంట పోచలింగం , ఎఒ అశోక్ కుమార్, ఎఆర్ , సివిల్, వివిధ వింగ్స్, సీపీఓ సిబ్బంది మరియు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App