TRINETHRAM NEWS

Trinethram News : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16 విడత నిధులను త్వరలో విడుదల చేయనుంది. 2024 ఫిబ్రవరి 28న మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు.

ఈ మేరకు పీఎం కిసాన్‌ అధికారికంగా ట్వీట్ చేసింది.

15వ విడత పీఎం కిసాన్ నిధులను గతేడాది నవంబర్ లో మోదీ రిలీజ్ చేశారు. 8 కోట్ల మందికి రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమ చేసింది కేంద్రం. పీఎం కిసాన్ కింద ప్రతీ రైతుకు ఏడాదికి రూ.6 వేలను మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున జమ చేయనున్న విషయం తెలిసిందే. ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈ డబ్బులు అందనున్నాయి.