TRINETHRAM NEWS

డ్రైవింగ్‌లో ఉంటే.. ఫోన్‌ చేయొద్దు ప్లీజ్‌

పది నెలల్లో 1.56 లక్షల సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కేసుల నమోదు

నిబంధనలు పాటించకపోవడం, అతివేగంతో రక్తసిక్తమవుతున్న రహదారులు

సగటున రోజుకు 21 మంది మృతి

రాష్ట్రంలో గతేడాది పది నెలల్లో సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కేసులు 1.56 లక్షలు నమోదయ్యాయి. ఇలా సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేసేవారు, సిగ్నళ్లు జంప్‌ చేసే చోదకులు.. వారితో పాటు ఆ వాహనాల్లో ఉన్నవారి ప్రాణాలకు.. రోడ్డుపై వెళ్లే ఇతర ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుతెస్తున్నారు. నిబంధనలు పాటిస్తూ నడిపితే.. మన సమయాన్ని ఆదా చేసే వాహనాలు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విలువైన ప్రాణాల్నే హరిస్తున్నాయి. రాష్ట్రంలో వాహనదారులు నిబంధనలు పాటించక పోతుండడంతో.. ప్రతిరోజు 21 మంది రోడ్డు ప్రమాదాల్లో బలవుతున్నారు. నిత్యం 65 మంది గాయాలపాలవుతున్నారు. అర్థమైంది.. కదా? కుటుంబసభ్యులు డ్రైవింగ్‌లో ఉంటే మీబాధ్యతగా ఫోన్‌ చేయకండి. అత్యవసరమై ఫోన్‌ చేస్తే పక్కన ఆపి మాట్లాడాలని సూచించండి. ఈ నిబంధనను ప్రతిఒక్కరూ పాటించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2024లో జనవరి నుంచి అక్టోబరు వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,329 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా.. 19,642 మంది క్షతగాత్రులయ్యారని నివేదికలు చెబుతున్నాయి. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 2024లో అక్టోబరు నెలాఖరు వరకు పది నెలల్లో అధికారులు పెట్టిన కేసులు 1.18 కోట్లు. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ప్రమాదాల సంఖ్య అధికంగా ఉంటోంది. 1.18 కోట్ల కేసుల్లో 79 లక్షలు హెల్మెట్‌ ధరించని వారిపైనే ఉన్నాయి. జనవరిలో రోడ్డు భద్రత వారోత్సవాల నేపథ్యంలో ప్రమాదాల నియంత్రణకు అవగాహన పెంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రమాదాలు, మరణాలకు కారణాలివీ

చోదకులు వాహనాలు నడుపుతూ సెల్‌ఫోన్‌ వాడటం

ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాల్ని అతివేగంగా నడపడం

హెల్మెట్‌ ధరించకపోవడం.. సీటు బెల్టు పెట్టుకోకపోవడం

ట్రాఫిక్‌ సిగ్నళ్లను పట్టించుకోకుండా వాహనాల్ని నడపడం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App