TRINETHRAM NEWS

క్రీడలు, ఆటల తో శారీరక దారుఢ్యం,మానసిక ఆరోగ్యం పెరుగుతుంది

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి,IPS.ఇంటర్ జోన్ లో గెలిచిన పోలీస్ క్రీడాకారులు జోన్ తరుపున జనవరి 28 నుండి ఫిబ్రవరి 01 వరకు కరీంనగర్ లో జరగబోయే 3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ & పోలీస్ మీట్స్ లో పాల్గొంటారు.
వికారాబాద్ మరియు సంగారెడ్డి జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన పోలీస్‌ స్పోర్ట్స్ అండ్‌ గేమ్స్‌ మీట్‌ 2025లో గెలుపొందిన రెండు జిల్లాల పోలీస్ క్రీడాకారులకు ఈ రోజు ఛార్మినార్ జోన్ లోని ఈ రెండు జిల్లాలకు ఇంటర్ జోన్ క్రీడపోటీలను జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కె .నారాయణ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని జెండాను ఊపి పోటీలను ప్రారంభించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమం లో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 2025 ఆన్యువల్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ లో జోన్ నుండి కోకో, కబడ్డీ, వాలీబాల్,టాగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్ లలో పోటీలను నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్ళు వున్న క్రీడలు, ఆటలలో రాణిస్తున్న పోలీసులు ప్రతి ఒక్కరికీ స్పూర్తితో నిలవాలని, గేమ్స్ & స్పొర్ట్స్ వలన పోలీసులకు మోటివేషన్ తో పాటు వాళ్లలోని నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుంది అని, క్రీడల్లో గెలుపు ఓటములు ముఖ్యం కాదని, మీరు క్రీడల్లో ఎంత ప్రతిభ కనబరిచారో ముఖ్యమని అన్నారు. ఈ క్రీడల ద్వారా మీ శారీరక దారుఢ్యం పెరగడంతో పాటు, పని ఒత్తిళ్ళను అధిగమించి ఆరోగ్యంగా ఉంటారని ఎస్పీ తెలిపారు. ఈ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులతో పాటు, క్రీడల నిర్వహణాధికారులను జిల్లా ఎస్పీ గారు గారు అభినందనలు తెలిపి నారు. ఈ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గోనాల్సి ఉంటుందని.
ఇట్టి కార్యక్రమం లో జిల్లా వికారాబాద్ డి‌ఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి,ఏ‌ఆర్ డి‌ఎస్‌పి వీరేశ్, ఇన్స్పెక్టర్ లు , సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, ఆర్‌ఐ లు, ఎస్‌ఐ లు, ఆర్‌ఎస్‌ఐ లు, సంగారెడ్డి జిల్లా పోలీస్ క్రీడకారులు,జిల్లా సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App