TRINETHRAM NEWS

భౌతిక దాడులు చేసుకోవడం సరికాదు సిఐటియు

తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జీడీకే 11 ఇంక్లైన్లో ఓవర్ మెన్ శ్రీనివాసరావు సర్దార్ గా పనిచేస్తున్న కార్మికునిపై భౌతిక దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఏరియా ఆసుపత్రిలో చేరిన మేడ అజయ్ ను సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల.రాజారెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరిరావు పరామర్శించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ విధులు హాజరై రిపోర్టు చెప్పే క్రమంలో మాట మాట పెరిగి వ్యక్తిగత ప్రతిష్టతో దూషించుకుంటూ అంతటితో ఆగకుండా భౌతిక దాడికి సైతం పాల్పడడం సరైన చర్య కాదని అన్నారు.

ఏమైనా రిపోర్టు విషయంలో తప్పులు ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన శిక్ష విధించాలి కానీ ఇలా పని విషయమై గొడవ పడుతూ వ్యక్తిగత దూషణతో పాటు భౌతిక దాడి చేయడం సరైన పద్ధతి కాదని ఈ విషయంలో సదరు ఓవర్ మెన్ పై తగిన చర్య తీసుకొని అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఉత్పత్తి సాధించాలనే ఒత్తిడిలో ఉన్న మైనింగ్ స్టాఫ్ ను టెక్నికల్ స్టాఫ్ ను ఒత్తిడి లేకుండా పనిచేయించుకునే విధంగా చూడాలని అధికారులకు కార్మికులకు మధ్య సూపర్వైజర్లు నలిగిపోయి ఇలాంటి దాడులు చేసుకోవడం వారి హోదాకు సరైన పద్ధతి కాదని తగిన సంయమనం పాటించి తప్పులు ఏమున్నా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లే కంపెనీ నిభందనలకనుగుణంగా చర్యలు తీసుకునేలా చేయాలని అన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App