డిజిల్ కి బదులు పెట్రోల్
బంకు యజమానిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
దిండి త్రినేత్రం న్యూస్
పెట్రోల్ బంకులో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా డీజిల్ కి బదులు పెట్రోల్ పోయడంతో ఓ కారు రిపేర్ కు గురైంది. దీంతో బాధితుడు ఆ పెట్రోల్ బంక్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నుంచి శివాజీ తన కారులో హైదరాబాద్ బయలుదేరాడు. ఈ క్రమంలో మార్గం మధ్యలో డిండి మండల కేంద్రంలోని భవాని ఫిల్లింగ్ స్టేషన్ (హెచ్ పి పెట్రోల్ బంకు లో శివాజీ తన కారు లో 2100 రూపాయల డీజిల్ పోయమని చెప్పడంతో అక్కడ పని చేస్తున్న సిబ్బంది డీజిల్ కి బదులు పెట్రోల్ పోశారు దీనిని ఎవరు గమనించకపోవడంతో కారు దాదాపు 20 కిలోమీటర్ల దూరం వెళ్లగానే ఆగిపోయింది. దీంతో బాధితుడు తన కార్ ను తోచన్ సాయంతో మెకానిక్ షెడ్ కు తీసుకెళ్లి చూడ గా కారులో డీజిల్ కు బదులు పెట్రోల్ పోయడంతో కారు రిపేర్ కు గురైందని తెలిసింది.
ఈ ఘటనపై పెట్రోల్ బంక్ యజమాన్యంపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App