People should use medical services more widely
గత 3 నెలలుగా గణనీయంగా మెరుగైన ప్రభుత్వ ఆసుపత్రుల పని తీరు..
జిల్లా ఆసుపత్రిని 150 పడకల విస్తరించేందుకు కృషి చేస్తున్నాం..
జిల్లా ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కోయ హర్ష పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రోగుల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా కల్పించిన వసతులు, వైద్య సేవలను ప్రజలు మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు.
బుధవారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కంటి శస్త్ర చికిత్స విభాగం, పోలీస్ ఔట్ పోస్ట్, డెంటల్ విభాగంలో పరికరాలు, చిన్న పిల్లల వైద్య విభాగాలను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ హర్ష కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ
పెద్దపల్లి ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో నేడు బుధవారం
రోజున ప్రారంభించుకున్న నూతన పరికరాలు, విభాగాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆర్థోపెడిక్, కంటి శస్త్ర చికిత్స, డెంటల్ విభాగం, చిన్న పిల్లల వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామని వీటిని ప్రజలు సంపూర్ణంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. జిల్లా ఆసుపత్రిలో పోలీసు ఔట్ పోస్టు, కంటి శస్త్ర చికిత్స విభాగం, చిన్న పిల్లల వైద్య సదుపాయాలు, డెంటల్ పరికరాలు మొదలగు సేవలు కొత్తగా ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు.
గత 3 నెలలుగా జిల్లా ఆసుపత్రి, ఎంసిహెచ్ పనితీరు గణనీయంగా మెరుగైందని, ప్రసవాల సంఖ్య, ఆర్థోపెడిక్ శక్తుల చికిత్సలు, ఓపి సేవలు, డయాగ్నిస్టిక్ హబ్ ద్వారా పరీక్షల నిర్వహణ వంటివి పెరిగాయని, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసం బలపడుతుందని ఎమ్మెల్యే విజయరమణ రావు గారు అన్నారు.
ఎంసిహెచ్ లో గర్భిణుల కోసం టిఫా స్కానింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని, అదే విధంగా జిల్లా ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో సంక్లిష్టమైన క్షత్రియ చికిత్సలు చేయడానికి సీనియర్ ఆర్థోపెడిక్ వైద్యులు ఉన్నారని, దంతాలకు కావిటి ఫీలింగ్, రూట్ కెనాల్ సర్జరీ నిర్వహణ జరుగుతుందని, కంటి శస్త్ర చికిత్సల పరికరాలు అందుబాటులోకి వచ్చాయని వీటిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
ప్రజలకు మెరుగైన చికిత్సలు అందించే దిశగా వైద్యులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించారని ఎమ్మెల్యే ప్రశంసించారు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రికి పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఆసుపత్రిలోని పేషెంట్లకు మెరుగైన చికిత్సను అందించాలని అలాగే ఆసుపత్రిలో పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు వహించాలని ఆసుపత్రి సుపరిడెంట్ ఎమ్మెల్యే విజయరమణ రావు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఆర్.ఎం.ఓ డాక్టర్ రవీందర్, సంబంధిత వైద్య అధికారులు, పట్టణ కౌన్సీలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.