TRINETHRAM NEWS

ఉద్యోగస్తుల పెండింగ్ డీఏ విడుదల

Trinethram News : హైదరాబాద్:అక్టోబర్ 25
దాదాపు 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, దీపావళి కానుకగా ఒకటి లేదా రెండు డియర్ నెస్, అలవెన్స్, ఉద్యోగులు అందుకోనున్నారు.

రాష్ట్రంలో పెండింగ్ డీఏలపై ఈరోజు సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటించను న్నట్లు… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

గురువారం సాయంత్రం బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీజీవో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు.

దాదాపు 3 గంటల పాటు జ‌రిగిన ఈ స‌మావేశంలో.. ఉద్యోగ సంఘాల జేఏసీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉన్న దని సీఎం స్పష్టం చేశారు.

ఈ క్ర‌మంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీని నియమిం చారు.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షుడి గా… మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా.. కె.కేశవరావు ప్రత్యేక ఆహ్వానితుడిగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

దీపావళి తర్వాత శాఖల వారీగా ఉద్యోగుల ప్రతినిధులతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై చర్చి స్తుందని సీఎం అన్నారు.

జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై… కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం వెల్లడించారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App