Peaceful general meeting of Vikarabad Municipal
41 అంశాలతో కూడిన ఎజెండాను ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు.. కౌన్సిల్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ..
వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కౌన్సిల్ సభ్యులు 41 అంశాలతో కూడిన ఎజెండాను ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే మున్సిపల్ లోని వివిధ వార్డులలో ఉన్న సమస్యలను చైర్ పర్సన్ దృష్టికి తీసుకురావడంతో పాటు పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్య సమస్యలపై సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరిగింది.
మున్సిపల్ సాధారణ సమావేశం అనంతరం చైర్ పర్సన్ చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్ పర్సన్ మంజుల రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి మరియు వికారాబాద్ శాసనసభ్యులు గౌరవ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో వికారాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని అన్నారు.
పట్టణ అభివృద్ధి పట్ల సుదీర్ఘ సమయం చర్చించి సహకరించిన కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు అందరికీ చైర్ పర్సన్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈనెల ఆగస్టు 5వ తారీఖు నుంచి ఆగస్టు 9వ తారీకు వరకు ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చైర్ పర్సన్ వెల్లడించారు.
ఈ సమావేశంలో వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి, కమిషనర్ జాకీర్ అహ్మద్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App