గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పుతూ, శాంతిభద్రతలు
పరిరక్షణ చేయటమే ముఖ్య ఉద్దేశంతో గ్రామాల్లో శాంతి సమస్యలు పరిష్కారం గురించి టూ టౌన్ ప్రసాద్ రావు సిఐ
రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ప్రజలకు మీ రక్షణ, భద్రత గురించి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ చట్టపరిధిలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ పోలీస్ మీకోసం ఉంటుందనే నమ్మకం, భరోసా కల్పిస్తూ, అసాంఘిక శక్తులను కట్టడి చేయడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ప్రజలతో మమేకమైతు సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమాన్ని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా పెద్దపల్లి జోన్ గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామగిరి మండలం చందానాపూర్ గ్రామం లో “పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి గోదావరిఖని 2 టౌన్ సిఐ ప్రసాదరావు హాజరై ప్రజలతో మాట్లాడి ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రామాల్లో ఈ పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రజలకు తెలిపారు.
ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ ప్రజలకు పోలీసులు దగ్గర కావడానికి పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. గ్రామ లలో పోలీస్ నైట్ హాల్ట్ వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. గ్రామం లోని సమస్యలను తెలుసుకుని ఇతర శాఖలకు సిఫారసు చేసే అవకాశం, శాంతియుత వాతావరణం కల్పించడంతో పాటు పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేయవచ్చు అన్నారు. గతంలో ఎక్కువగా నమోదైన కేసుల వివరాలు, లా అండ్ ఆర్డర్ సమస్యలు, ఇతర సమస్యలు తెలుసుకోవడం జరిగింది. గ్రామంలో ప్రజలు అందరు ప్రశాంతంగా మెలగాలన్నారు. ఘర్షణలకు పాల్పడకుండా స్నేహ భావం తో ఉండాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు బానిసై వారి విలువైన జీవితం నాశనం చేసుకోవద్దని, ఒక ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్ళి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.
తాత్కాలిక ఆనందాల కోసం ప్రలోభాలకు ఆకర్షణలకు గురై భవిష్యత్తు జీవితం నాశనం చేసుకోవద్దని విద్యార్థి దశ నుంచే మంచి లక్ష్యాలు అలవర్చుకొని పట్టుదలతో కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకోవాలని చదువు వలనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని విద్యార్దులకు తెలిపారు. యువతను ఉద్దేశిస్తూ గంజాయి, మద్యం, పేకాట ఇతర ఆసాంఘిక కార్యక్రమాల జోలికి పోయి యువత తమ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి రవాణా, గుడుంబా, ఇతర చట్ట వ్యతిరేక చర్యలకు అడ్డుకట్ట వేయడానికి గ్రామ వాసులు సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా యవత అసాంఘిక కార్యకలాపాలపైపు పెడదారి పట్టి భవిష్యత్ నాశనం చేసుకోవద్దన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గ్రామస్తులకు వివరించారు, గ్రామం లో సిసి కెమెరాల ఏర్పాట్ల ఆవశ్యకత వివరించారు. అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై వారిపై ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు స్థానికేతరులపై నిఘా ఉంచడం జరుగుతుంది. గ్రామం లోకి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వస్తే వెంటనే పోలీస్ కి సమాచారం సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియజేశారు. గ్రామం లో అనుమానితులకు, మావోయిస్టులకు ఆశ్రయం కల్పించవద్దని అన్నారు.
ఈ కార్యక్రమం లో గోదావరిఖని 2 టౌన్ సిఐ ప్రసాదరావు మరియు హెడ్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి ,కానిస్టేబుళ్లు కనకయ్య ,రాజయ్య లు మరియు గ్రామవాసులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App