TRINETHRAM NEWS

పిడిఎఫ్ రైస్ అక్రమ రవాణా

బియ్యాన్ని రవాణా చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఎస్ఐ

మంథని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని నుండి అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని రవాణా చేస్తున్నారని అందిన సమాచారం మేరకు మంథని పోలీస్ మరియు సివిల్ సప్లయర్ ఇన్స్పెక్టర్ మంథని నాగారం గ్రామ శివారు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్నటువంటి ఆటో ట్రాలీ అప్పే no.Ap 20 Y 7659 ఆపి తనిఖీ చేయగా అందులో ప్రజా పంపిణీ బియ్యం 20 ప్లాస్టిక్ సంచులలోఎటువంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్నారు. ఇట్టి బియ్యం గురించి డ్రైవర్ను అడగగా తన పేరు కుర్ర సమ్మయ్య s/o బుచ్చయ్య లైన్ గడ్డ మంథని అని తెలిపి తను ఆటో నడపడానికి డ్రైవర్ వచ్చినట్లు తెలియజేసి తాను కాసు ఒదులు మరియు వారి కుమారుడైన కాసు రాజు R/o బిట్టుపల్లి చెప్పిన విధంగా మహారాష్ట్రలోని సిరివంచకు తరలిస్తున్నట్లు తెలియజేసినాడు ఇట్టి రేషన్ బియ్యం ను అక్రమంగా తరలిస్తున్నటువంటి వారిపై కేసు నమోదు చేయడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pdf Rice Smuggling