నేడు జోనల్ కమిటీలతో పవన్ సమావేశం
AP: మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో నేడు జోనల్ కమిటీలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రచార విధివిధానాలపై చర్చించనున్నారు. సభలు, సమావేశాలు ఇతర కార్యక్రమాలు సజావుగా సాగేందుకు పార్టీ జోన్ల వారీగా ఈ కమిటీలు ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్ర, గోదావరి, మధ్య ఆంధ్ర, రాయలసీమ జోన్లుగా విభజించారు. ఈ కమిటీల్లో పార్టీకి చెందిన న్యాయ, వైద్య బృందాలు సభ్యులుగా ఉండనున్నారు.