TRINETHRAM NEWS

Pawan Kalyan: నేటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్న పవన్

కాకినాడ: నేటి నుంచి కాకినాడ జిల్లాలో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు కాకినాడలో మకాం వేయనున్నారు. నేడు తొలిరోజు కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు..

కాకినాడ విద్యుత్ నగర్‌లోని ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్‌లో పవన్ బస చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ బలాబలాలపై ఇన్‌చార్జిలతో సమీక్ష నిర్వహించనున్నారు. నియోజకవర్గాల్లో టీడీపీతో సమన్వయంతో పనిచేసేలా దిశా నిర్దేశం చేశారు. వివిధ ప్రజా సంఘాలు, డ్వాక్రా సంఘాలతోనూ పవన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. తొలి విడత వారాహి యాత్రను కాకినాడ జిల్లా నుంచి పవన్ ప్రారంభించారు. ఇప్పుడు నియోజకవర్గాలవారీ సమీక్షలకు ఈ జిల్లానే ఎంచు కోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది..