TRINETHRAM NEWS

Trinethram News : భీమవరంలో ఓటమి బాధను బయటపెట్టారు పవన్ కల్యాణ్. ఈసారి ఎన్నికల్లో కులానికి అతీతంగా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో జనసేన జెండా ఎగరాలన్నారు. భీమవరంలో గెలిచిన తర్వాత స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు పవన్.

భీమవరంలో ఓటమిపై మనసులో మాటను చెప్పారు పవన్ కల్యాణ్. పులివెందులలో జగన్‌పై ఓడినా.. బాధపడేవాడిని కాదు.. కాని భీమవరంలో ఓడిపోవడం చాలా బాధకలిగించిందంటూ నాలుగున్నరేళ్లుగా మనసులో దాచుకున్న బాధను బయటపెట్టారు పవన్. భీమవరంలో గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న పవన్.. ఈసారి ఎన్నికల్లో భీమవరం సీటు జనసేనదే.. భీమవరంలో జనసేన విజయఢంకా మోగించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు పవన్‌ కల్యాణ్. అవతలి వాళ్లు ఎన్ని కోట్లయినా కుమ్మరించనీ.. భీమవరంలో జనసేన జెండా ఎగరాలంటూ కేడర్ కు సూచనలు చేశారు. ఈసారి ఎన్నికల్లో కులానికి అతీతంగా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

రౌడీల చేతిలోనుంచి రాజ్యం తీసుకొని.. కనీస రాజకీయ విలువలు కలిగిన వారి చేతిలో పెట్టాలనుకుంటున్నానని చెప్పారు పవన్. ఈసారి భీమవరం సీటుపై దృష్టిపెడదాం.. మన ముఖ్య గోల్ రాష్ట్రంలో జగన్‌ పోవాలి.. భీమవరంలో గ్రంధి సీటు ఓడాలి అంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు పవన్. భీమవరంలో గెలిచిన తర్వాత స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పవన్ చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో భీమవరం జలగ సహా జగన్ తాలూకు జలగలను తీసిపారేస్తామన్న పవన్.. భీమవరంలో జనసేనపార్టీ గెలవగానే.. డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తానని.. రౌడీయిజాన్ని కూకటి వేళ్లతో పెకలించివేస్తానని చెప్పారు పవన్. అలాగే రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు పవన్.