Participated in Public Governance Day celebrations in public government
పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం రోజున “తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం” సందర్భంగా
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి. నేరెళ్ల శారద స్వాగతం పలికి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేరెళ్ల శారద మరియు మరియు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ అలాగే జిల్లా అధికారులతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
ఏటా సెప్టెంబర్ 17వ తేదీని “తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం” గా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1948, సెప్టెంబరు 17న రాచరిక పాలన ముగిసి తెలంగాణలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17ను “తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం” నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయించింది.
ఈ కార్యక్రమంలో జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్.కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అదనపు కలెక్టర్ జి.వి శ్యామ్ ప్రసాద్ లాల్ (రెవిన్యూ), అదనపు కలెక్టర్ అరుణ (స్థానిక సంస్థలు), డీసిపి చేతన, ఎసిపి గజ్జి కృష్ణ మరియు జిల్లా అధికారులు మరియు ప్రజా ప్రతినిదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App