TRINETHRAM NEWS

కోర్టు ప్రాంగణంలో పార్కింగ్ ప్రదేశం కేటాయించాలి పౌరసంక్షేమ సంఘం
Trinethram News : (5.2.2025) : కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ లో వున్న కోర్టుకాంప్లెక్స్ ప్రాంగణంలో స్కూటర్లు కార్ల పార్కింగ్ కు ప్రత్యేక ప్రదేశం కేటాయించాలని పౌరసంక్షేమ సంఘం జిల్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరింది. రిజిస్ట్రార్ సబ్ జైలు ట్రెజరీ సైనిక సంక్షేమం ఆర్ అండ్ బి మున్నగు ప్రభుత్వ విభాగాలు న్నందున నిత్యంరద్దీగా వాహనాల ప్రవేశం వుంటున్నదన్నారు. ఎక్కడ బడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేయడం వలన అసౌకర్యం క్లీన్ అండ్ గ్రీన్ నిర్వహణ జరగడం లేదన్నారు.

కక్షిదారులు కార్యాలయాలకు వచ్చే ప్రజలు కూర్చునేందుకు నిలిచేందుకు కనీస సురక్షిత ప్రదేశం వుండడం లేదన్నారు. ప్రత్యేక స్థలాన్ని పార్కింగ్ కోసం ఏర్పాటు చేయించడం వలన అడ్డ దిడ్డంగా పార్కింగ్ చేసే దుస్థితి తప్పుతుందన్నారు. కోర్టు ఆవరణను పచ్చదనంతో పర్యావరణ ప్రదేశంగా తీర్చిదిద్దాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు జిల్లా అధికారులకు పంపిన లేఖలో కోరారు. జ్యూడిషియల్ మిని పార్కును ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App