
Trinethram News : గుంటూరులో పానీపూరి విక్రయాలు నిలిపివేయాలని జీఎంసీ అధికారులు ఆదేశించారు. పానీపూరిలో ఉపయోగించే నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని జిల్లా వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో బుధవారం రాత్రి జీఎంసీ శానిటరీ సూపర్వైజర్ అయుబ్ తన బృందాలతో నగరంలో పానీపూరి విక్రయాలపై దాడులు నిర్వహించారు. అందులో ఉపయోగించే పానీపూరిని పారబోయించారు. 10 రోజులపాటు విక్రయాలు చేయవద్దని ఆదేశించారు.
